ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహావిష్కరణ
కల్వకుర్తి మార్చి 6:కల్వకుర్తి పట్టణంలోని మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 100వ సేవా కార్యక్రమంలో భాగంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహావిష్కరణ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. దేశభక్తి స్పూర్తిని ప్రజల్లో పెంపొందించడం, స్వాతంత్య్ర సమర యోధుల త్యాగాలను తరతరాలకు గుర్తు చేయాలనే లక్ష్యంతో విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు అభిమానులు నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం చేసిన త్యాగాలు యువతకు ఎప్పటికీ ప్రేరణగా నిలుస్తాయన్నారు.
సమాజంలో దేశభక్తి భావాన్ని పెంపొందించడం ప్రతి భారతీయుడి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బృంగి రత్నమాల, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి , పట్టణంలోని వివిధ కాలనీల ప్రజలు, యువత, నేతాజీ అభిమానులు మిత్ర ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.




