ఎమ్మెల్యే కసిరెడ్డిని కలిసిన నిర్వాసితులు
చారకొండ మార్చి 6మండలంలోని గోకారం శివారులో నిర్మిస్తున్న రిజర్వాయర్ సామర్థ్యం తగ్గించి ముంపు నుంచి తమ గ్రామాలను కాపాడాలని 95 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్న ఎర్రవల్లి, ఎర్రవల్లి తండాల భూ నిర్వాసితులు శుక్రవారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని హైదరాబాద్లోని తన నివాసంలో కలిశారు. అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు కట్టుబడి తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరగా మాకు న్యాయం జరిగేటట్టు చూడాలని కోరారు.
దీనికి ఎమ్మెల్యే స్పందిస్తూ నిర్వాసితులకు కచ్చితంగా న్యాయం జరిగేలా కృషి చేస్తానని చెప్పినట్లు నిర్వాసితులు తెలిపారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ సాంబయ్య గౌడ్, నిర్వాసితులు పెద్దయ్య గౌడ్, ప్రకాశ్, ఏకుల పర్వతాలు, శ్రీరామ్, సంజీవ నాయక్, లాలూ నాయక్, పబ్బు రాములు , దేవేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.




