28 June, 2026 | 1:50 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

నేతాజీ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

10-01-2026 06:07 PM

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): జిల్లా సిరిసిల్ల పట్టణంలోని నేతాజీ డిగ్రీ కళాశాలలో నేతాజీ యూత్ ఫెస్టివల్ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమెన్ ఎంపవర్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి బోనాల రోజా  ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థినీ విద్యార్థులను ఉత్సాహపరిచారు. 

ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో రంగురంగుల ముగ్గులతో కళకళలాడింది. విద్యార్థినులు తమ సృజనాత్మకతను ప్రతిబింబించే విధంగా సంప్రదాయ విలువలను చాటే అందమైన ముగ్గులు వేశారు. పోటీలలో పాల్గొన్న విద్యార్థుల ప్రతిభను అతిథులు ప్రశంసించారు.ప్రిన్సిపల్ శ్రీకాంత్ మాట్లాడుతూ, ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సాంస్కృతిక విలువలను పెంపొందించడమే కాకుండా  సృజనాత్మకతను వెలికి తీస్తాయని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు.బోనాల రోజా  మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు సాంప్రదాయకరమైన పండుగలలో పాల్గొని తమ ప్రతిభను కనబరిచారని అన్నారు. ముగ్గులతో తమ యొక్క కలలను ప్రదర్శించడం జరిగిందని పేర్కొన్నారు. విద్యార్థినీ విద్యార్థులు చక్కని విద్యను అభ్యసించి తమ జీవితాలలో ఉన్నతంగా స్థిరపడాలని ఆశిస్తున్నాను అన్నారు. అదేవిధంగా ఉమన్ ఎంపవర్మెంట్ చైల్డ్ ప్రొటెక్షన్ గురించి వివరించడం జరిగింది.