28 June, 2026 | 2:51 PM

Breaking News

ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •  

శ్రీ శివాలయం అర్చకులకు ఘనంగా సన్మానం

10-01-2026 06:11 PM

పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తబృందం

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ శివాలయం అర్చకులు వల్లకొండ మఠం మహేష్ శనివారం తో 2 సంవత్సరాల విధి నిర్వహణ గడువు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వారికి శివాలయం భక్తబృందం తరపున ఆలయ చైర్మన్ అల్లంకి సత్యనారాయణ పాలక మండలి సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా భక్తుబృందం  ఘనంగా సన్మానించారు. భక్తులకు.. భగవంతునికి అనుసంధానంగా వారు అందించిన సేవలు అనర్వచనీయమైనవి అన్నారు.

రెండు సంవత్సరాల అర్చక బాధ్యతల మార్పిడిలో భాగంగా ఇదే సందర్భంలో వల్లకొండ మఠం రమేష్  అర్చకులుగా బాధ్యతలు తీసుకుంటున్న వారికి హార్థిక శుభాభినందనలు తెలియజేసి  ఆలయ కమిటీ చైర్మన్ అల్లంకి సత్యనారాయణ,  పాలక మండలి సభ్యులు ఆత్మీయ సత్కారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ (ఏవో కలెక్టరేట్) బండి ప్రకాష్ తోపాటు భక్త బృందం పెద్ద ఎత్తున పాల్గొని ఇద్దరు పూజారుల కు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం (ఏవో కలెక్టరేట్) బండి ప్రకాష్ ను భక్తబృందం ఘనంగా సన్మానించారు.