రాజ్యసభ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం
న్యూఢిల్లీ,(విజయక్రాంతి): రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ పై విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని మంగళవారం ప్రవేశపెట్టాయి. 60 మంది ఎంపీలు సంతకాలు చేసిన అవిశ్వాసం తీర్మానం నోటీసును ఇండియా కూటమి సెక్రటరీ జనరల్ కు అందజేసింది. ధన్ ఖడ్ అధికారపక్షం వైపు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, రాజ్యసభ నుంచి తాము తరచూ వాకౌట్ చేయాల్సిన పరిస్థితికి చైర్మన్ ధన్ ఖడ్ వైఖరే కారణమని విపక్ష ఎంపీలు ఆరోపిస్తున్నారు. మరో మార్గం లేకే బాధతోనే నోటీసు ఇవ్వాల్సి వస్తుందని విపక్ష నేతలు తెలిపారు. ఈ తీర్మానంపై ఇండియా కూటమి పార్టీలైన తృణమూల్, ఆమ్ ఆద్మీపార్టీ,సమాజ్ వాదీ పార్టీ, డీఎంకే, ఆర్జేడీ తదితర పార్టీలకు చెందిన 60 మంది ఎంపీలు సంతకాలు చేశారు. చైర్మన్ కు వ్యతీరేకంగా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాడం భారత పార్టమెంటరీ చరిత్రలో ఇది మొదటిసారి.






