నెతన్యాహు తాజా వీడియో కూడా ఏఐదే!
- అది ‘డీపేఫేక్’గా తేల్చిన గ్రోక్
సోషల్ మీడియాలో వైరల్
రంగంలోకి ఇజ్రాయెల్ పీఎంఓ
ప్రధానమంత్రి పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని స్పష్టం
బాగ్దాద్, మార్చి 16: ఇజ్రాయెల్ ప్రధాని బెన్జమిన్ నెతన్యాహు మృతిచెందారంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వదంతులకు చెక్ పెట్టేందుకు నెతన్యాహు స్వయంగా ఆదివారం ఒక వీడి యో విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వీడియో కూడా మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఆ వీడియోను పరిశీలించిన నెటిజన్లతో పాటుగా ఎక్స్ ప్లా ట్ ఫారమ్‌లోని ఏఐ చాట్‌బాట్ ‘గ్రోక్’సైతం ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సృష్టించిన ‘డీప్‌ఫేక్’ వీడియో అని తేల్చి చెప్పడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం అవుతోంది.
ఇరాన్-, ఇజ్రాయెల్ యుద్ధం నేప థ్యంలో నెతన్యాహు భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. గత వారమే ఆయనకు 6 వేళ్లు ఉన్నట్లు కనిపిస్తున్న ఒక వీడియో బయటకు రావడంతో ఆయన మరణించారనే వార్తలు వైరల్ అయ్యాయి. వీటన్నింటికీ చెక్‌పెడుతూ.. నెతన్యాహు తాజాగా జెరూసలేం కొండల్లోని ‘ది సటాఫ్’ అనే కేఫ్ వద్ద కాఫీ ఆర్డర్ ఇస్తూ ఒక వీడియో షేర్ చేశారు. ‘మీరు చనిపోయారని వార్తలు వస్తున్నాయి’ అని ఒకరు అడిగిన ప్రశ్నకు..
‘నేను కాఫీ కోసం చస్తున్నా’ అంటూ వ్యంగ్యంగా సమాధానమిచ్చారు ఆ వీడియోలో. అంతేకాకుం డా తన రెండు చేతులను కెమెరా ముందు చూపిస్తూ వేళ్లను లెక్కపెట్టుకోమంటూ సవా ల్ విసిరారు. అయితే ఈ వీడియోపై ఎక్స్ యూజర్లు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వీడియోలో నెతన్యాహు కాఫీ కప్పు పట్టుకున్న తీరు, ఆయన జేబులో నుంచి చేతులు బయటకు తీసిన విధానం సహజంగా లేవని నెటిజన్లు గుర్తించారు.
ముఖ్యం గా నెతన్యాహు కిందకు చూసినప్పుడు ఆయ న ముఖం ఆకారం గుండ్రం నుంచి కోడిగుడ్డు ఆకారంలోకి మారిపోతోందని కొంద రు క్లోజప్ షాట్స్ షేర్ చేశారు. వీటన్నింటికీ తోడు గ్రోక్‌చాట్‌బాట్ స్పందిస్తూ.. ఆ వీడియో 100 శాతం అడ్వానస్డ్ ఏఐ డీప్ ఫేక్ అని తేల్చేసింది. ఇలాంటి సంఘటన నిజంగా జరగలేదు. దీనిని అన్-రిలీజ్డ్ ఏఐ టెక్నాలజీతో సృష్టించారని బదులివ్వడం చర్చనీయాంశంగా మారింది.
ఈ వివాదం ముదురుతుండటంతో ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం రంగంలోకి దిగింది. ఇవన్నీ కేవలం ఫేక్ న్యూస్ అని.. ప్రధానమంత్రి పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని స్పష్టం చేసింది. ఆయన కాఫీ తాగిన సటాఫ్ కేఫ్ యాజమాన్యం కూడా నెతన్యాహు తమ వద్దకు వచ్చిన ఫొటోలను ఇన్‌స్ట్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అయినప్పటికీ.. ఏఐ యుగంలో నిజమేదో, అబద్ధమేదో తేల్చుకోలేక సామా న్య ప్రజలు అయోమయంలో పడ్డారు.




