17 March, 2026 | 9:31 AM

భారత్‌కు చేరిన ఎల్పీజీ శివాలిక్

17-03-2026 02:27 AM
  1. హోర్ముజ్ జలసంధిని దాటుకుని వచ్చిన నౌక
  2. గుజరాత్ పోర్ట్‌లో 45వేల మెట్రిక్ టన్నుల గ్యాస్ అన్‌లోడింగ్
  3. నేడు 80వేల మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్ నౌక రాక
  4. త్వరలో రానున్న ఎల్పీజీ ట్యాంకర్ నౌక నందాదేవి

గుజరాత్, మార్చి 16: పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థుతుల మధ్య భారత దేశంలో ఇంధన సరఫరాపై ఆందోళన నెలకొన్నాయి. దీంతో హోర్ముజ్ జలసంధి వద్ద వందలాది నౌకలు నిలిచిపోయాయి. ఇంత క్లిష్టపరిస్థితుల్లో హోర్ముజ్‌ను దాటుకుని 45 వేల మెట్రిక్ టన్నుల లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ) భారీ ట్యాంకర్ శివాలిక్ సోమవారం భారత్‌కు సురక్షితంగా చేరుకుంది. మంగళవారం 80 వేల మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్ నౌక భారత్‌కు రానుంది. అలాగే త్వరలోనూ మరో 45 వేల టన్నుల గ్యాస్‌నౌక నందాదేవి రానుంది.

శివాలిక్ ఎల్పీజీ ట్యాంకర్ ఖతార్‌లోని రాస్ లఫ్పాన్ నుంచి వేల టన్నుల ఎల్పీజీని భారత్‌కు మోసుకొచ్చింది. సోమవారం సాయంత్రం గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు శివాలిక్ నౌక వచ్చింది. ఈ నౌకలో 45,000 మెట్రిక్ టన్నుల గ్యాస్ భారత్‌కు వచ్చిందని జాతీయ మీడియా పేర్కొంది. ఈ నౌక హోర్ముజ్ జలసంధిని దాటుకుని సోమవారం సాయం త్రం గుజరాత్‌కు చేరకుం టుందని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ కుమార్ సిన్హా అంతుకుముందే పేర్కొన్నారు. 80వేల మెట్రిక్ టన్నుల క్రూడ్‌ఆయిల్‌తో వస్తోన్న ‘జగ్ లాడ్కీ’ నౌక మంగళవారం భారత్‌కు చేరుకుంటుందని చెప్పారు.

అలాగే పర్షియన్ గల్ఫ్‌కు పశ్చిమాన 22 భారత నౌకలు ఉన్నాయని, వాటిలో 616 మంది నావికులు సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. హో ర్ముజ్‌కు ఇరువైపులా వందలాది నౌకలు చిక్కుకుపోగా, ఈ జలసంధి ద్వారా భారత నౌకలు వెళ్లేందుకు అనుమతిస్తామని ఇరాన్ పేర్కొన్న విషయం విదితమే.. ఈ క్రామంలో భారత జెండాలున్న ఎల్పీజీనౌక లు రెండు రోజుల క్రితమే హోర్ముజ్ సంధిని దాటాయి. ఇందులో ఒకటి శివాలిక్ గుజరాత్‌కు చేరుకున్నది. మరొకటి నందాదేవి త్వరలోనే 45 వేల మెట్రిక్ టన్నుల గ్యాస్‌ను తీసుకుని రానుంది.