30 June, 2026 | 1:24 PM

ఆస్ట్రేలియా X ఒమాన్

06-06-2024 12:18 AM

బ్రిడ్జ్‌టౌన్: ఏడాది వ్యవధిలో రెండు మెగా టైటిళ్లు సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా జట్టు నేడు టీ20 ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్ ఆడనుంది. గ్రూప్ భాగంగా బ్రిడ్జ్‌టౌన్ వేదికగా పసికూన ఒమాన్‌తో మిచెల్ మార్ష్ సేన అమీతుమీ తేల్చుకోనుంది. టీ20 ప్రపంచకప్‌లోనూ విజేతగా నిలిచి మూడు ఫార్మాట్ల టైటిళ్లు సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఆసీస్ బరిలోకి దిగుతుంది. 

ఐపీఎల్లో పరుగుల వరద పారించిన ట్రావిస్ హెడ్ కీలకం కానుండగా.. వార్నర్, మిచెల్ మార్ష్, కామెరాన్ గ్రీన్, మ్యాక్స్‌వెల్, స్టోయినిస్‌లతో బ్యాటింగ్ విభాగం దుర్భేద్యంగా కనిపిస్తోంది. ఇక బౌలింగ్‌లో కమిన్స్, హాజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్ త్రయంతో పేస్ విభాగం బలంగా ఉంది. ఆడమ్ జంపా స్పిన్ బాధ్యతలు మోయనున్నాడు. మరోవైపు పసికూన ఒమాన్ తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది.  ఇక గ్రూప్ పపువా న్యూ గినియా, ఉగాండాలు మరో మ్యాచ్‌లో తలపడనున్నాయి.