గోశాలలను రక్షించేందుకు నూతన విధానం
03-09-2025 01:06 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): తెలంగాణలోని గోశాలలను రక్షించేందుకు ప్రభుత్వం నూతన విధానం తీసుకొచ్చింది. కష్టాల్లో ఉన్న స్వచ్చంద సంస్థల నుంచి గోశాలలను గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, పర్యావరణ స్థిరత్వం, పశు సంక్షేమానికి ఉత్పాదకాలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నూతన విధానం గోశాలలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరిస్తుంది. గోశాల పర్యావరణ వ్యవస్థను పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు మర్చనున్నారు.






