30 July, 2026 | 11:58 AM

భార్యను కడతేర్చిన భర్త

03-09-2025 01:07 AM

బూర్గంపాడు,(విజయక్రాంతి): చెడు వ్యసనాలను మానుకోమ్మనందుకు భార్యను కడ తేర్చిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. మండల కేంద్రానికి చెందిన షంషీర్ పాషా ఆటో డ్రైవర్. గత కొంతకాలంగా అప్పులు చేస్తూ ఏ పని చేయకుండా ఇంటి దగ్గరే ఉంటున్నాడు. వృధా ఖర్చులు చేస్తుంటే ఎందుకు చేస్తున్నావు అని భార్య షేక్ మహిముదా అడిగినందుకు కోపంతో సోమవారం అర్ధరాత్రి ఆమె గొంతు నులిమి చంపేశాడు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ఈ సంఘటనపై మృతురాలి తల్లి అయినా షేక్ సలీమా ఫిర్యాదు మేరకు ఎస్ఐ మేడా ప్రసాద్ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.నిందితుడు షేక్ షంషీర్ పాషా ను పాల్వంచ సర్కిల్ ఇన్స్పెక్టర్  సతీష్ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.