calender_icon.png 12 July, 2025 | 1:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే పద్మావతిని కలిసిన బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం

12-04-2025 07:37:16 PM

కోదాడ: నూతనంగా ఎన్నికైన కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, బార్ అసోసియేషన్ కమిటి సభ్యులు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిని కోదాడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి నూతనంగా ఎన్నికైన బార్ అసోసియేషన్ కార్యవర్గాన్ని  శాలువాలు, బోకెలతో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయం చైర్మన్ వంగవీటి రామారావు, కందల కోటేశ్వరరావు, మేకల వెంకట్రావు, బాల్ రెడ్డి కొండల్ రెడ్డి నూతన కార్యవర్గం తదితరులు నాయకులు పాల్గొన్నారు