12-07-2025 12:19:23 PM
హైదరాబాద్: హైదరాబాద్‌లోని షామీర్‌పేటలో జరుగుతున్న నల్సార్ విశ్వవిద్యాలయం(NALSAR University of Law) 22వ వార్షిక స్నాతకోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy), సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్(CJI Justice BR Gavai), సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ పి.ఎస్. నరసింహ, హైకోర్టు జస్టిస్ సుజయ్ పాల్(High Court Justice Sujoy Paul) పాపాల్గొన్నారు. న్యాయవాదులు నిరంతంర తమను తాము నిరూపించుకోవాలని సూచించారు. కోర్టు తీర్పులకు సబంధించి సమగ్ర అవగాహన కలిగి ఉండాలన్నారు.
ప్రస్తుతం న్యాయవాద విద్యలో ప్రవేశించేవారి సంఖ్య సానుకూలంగా పెరుగుతోందని చెప్పారు. ఏఐ, డేటా ప్రైవసీ విషయంలో అనుకూల, ప్రతికూల ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. సరైన మార్గదర్శకం ఉంటేనే.. నైపుణ్యం సాధించగలం అన్నారు. మెంటార్ షిప్ ను ఒక బాధ్యతగా భావించాలని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. వృత్తిని, చేసే పనిని ప్రేమించాలి.. అప్పుడే సరైనా ఫలితాలు పొందగలుగుతామన్నారు. దేశంలో న్యాయవ్యవస్థలో ఎన్నో సవాళ్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కొన్ని కేసుల విచారణ దశాబ్దాల పాటు సాగటం ఆందోళనకరమని సీజేఐ జస్టిస్ బి.ఆర్ గవాయ్ అన్నారు.