calender_icon.png 12 July, 2025 | 6:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమ్యూనిస్టు యోధుడు దొడ్డ నారాయణ రావు మృతి బాధాకరం

12-07-2025 11:25:10 AM

కోదాడ: చిలుకూరు మండల కేంద్రానికి చెందిన సిపిఐ నేత తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డ నారాయణ(Dodda Narayana passes away) మృతి బాధాకరమని కోదాడ కాంగ్రెస్ మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు అన్నారు. శనివారం గ్రామంలో నారాయణరావు పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ప్రజాసేవకే జీవితం అంకితం చేసిన వ్యక్తి నారాయణరావు అన్నారు. చిలుకూరు మండల అభివృద్ధిలో నారాయణరావు పాత్ర కీలకమన్నారు. గ్రామ సర్పంచిగా, ఎంపీపీగా,సింగిల్ విండో చైర్మన్ గా, బాధ్యతలు చేపట్టి పదవులకు వన్నె తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధనకు నేటి యువత కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బత్తిని హనుమంతరావు, డాక్టర్ నాగబండి శ్రీనివాసరావు, డాక్టర్ లక్ష్మీ ప్రసాద్, వేమూరి విద్యాసాగర్, రావెల కృష్ణారావు, శేషు లు నివాళులర్పించారు.