12-07-2025 11:57:36 AM
నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): ఉమ్మడి నల్లగొండ జిల్లా సిపిఐ జిల్లా మాజీ కార్యదర్శి, తెలంగాణ సాయుధ రైతంగ పోరాట యోధులు దొడ్డ నారాయణరావు(Dodda Narayana Rao) చిలుకూరు మండల కేంద్రంలో రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన మృతికి సిపిఐఎం నల్గొండ జిల్లా కమిటీ సంతాపం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది.
సంతాపం తెలిపిన వారిలో నల్లగొండ మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి, సిపిఐఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ఉన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించాలని చెప్పారు. అలాగే చిలుకూరు ఎంపీపీగా జడ్పిటిసిగా అనేక ప్రజా సమస్యల పరిష్కారానికి నికరంగా కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన మరణం ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరనిలోటుని పేర్కొన్నారు. అనేక ప్రజా సమస్యలపై ఉభయ కమ్యూనిస్టు పార్టీలుగా పోరాడమని గుర్తు చేశారు. ఆయన మరణం నాకు సిపిఎం నల్గొండ జిల్లా కమిటీ తీవ్ర సంతాపం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తుందని అన్నారు.