16 March, 2026 | 3:58 PM

బెల్లంపల్లి నూతన ఏసీపీ కిరణ్ కుమార్ బాధ్యతల స్వీకరణ

16-03-2026 11:51 AM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నూతన ఏసీపీ కిరణ్ కుమార్(New Bellampalli ACP Kiran Kumar) సోమవారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఆయన బెల్లంపల్లి లోని శ్రీ కోదండ రామాలయం వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. పురోహితుడు ప్రత్యేక అర్చన చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. బెల్లంపల్లిలో ఏసీపీగా పనిచేసిన రవికుమార్ డీజీపీ కి రిపోర్ట్ చేశారు. ఆయన స్థానంలో  హైదరాబాదులో డిఎస్పి కంట్రోల్ రూమ్ లో పనిచేస్తున్న కిరణ్ కుమార్ బెల్లంపల్లికి బదిలీ అయ్యారు. ఈ మేరకు నూతన ఏసీపీ గా బాధ్యతలు చేపట్టిన కిరణ్ కుమార్ కు సబ్ డివిజన్ లో పనిచేస్తున్న సీఐలు, ఎస్ ఐ లు పోలీసు అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.