కొత్త కోర్సులు రావాలి
22-05-2024 12:00 AM
ఇప్పుడు విద్యార్థుల్లో చాలా మంది దృష్టి ఇంజినీరింగ్ కోర్సులపైనే ఉంటోంది. ప్రతి ఒక్కరూ ఐటి ప్రొఫెషనల్స్ కావాలనే కోరుకుంటున్నారు. ఆ కోర్సుల్లోనే ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉండడం అందుకు ప్రధాన కారణం. ప్రతి ఒక్కరూ అదే కోర్సులకోసం ఎగబడితే ఆ కోర్సుల స్థాయి కూడా తగ్గిపోతోంది. పుట్టగొ డుగుల్లా వెలసిన ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్లు భర్తీ కావడమే గగనంగా మారుతోంది. అందువల్ల డిగ్రీ స్థాయిలో కూడా ఉపాధికి అవకాశం ఉండే కొత్త కోర్సులను ప్రవేశపెడితే బాగుంటుంది.
శ్రీలత, కెనరానగర్, ఉప్పల్






