20 March, 2026 | 9:13 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

16 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గం

21-09-2024 02:18 AM

మంత్రి తుమ్మల 

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం 16 వ్యవ సాయ మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 64 మార్కెట్లకు పాలకవర్గాలను ఏర్పాటు చేసినట్లు, మిగతా మార్కెట్లకు త్వరలో కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.

సిరిసిల్ల మార్కెట్ చైర్ పర్సన్‌గా వేముల స్వరూప, వైస్ చైర్మన్ నేరేళ్ల నర్సయ్య, వీర్నపల్లి మార్కెట్‌కు చైర్మన్‌గా లకావత్ రాములు, వైస్ చైర్మన్‌గా లెంకల లక్ష్మణ్, రాచల బొప్పారం చైర్‌పర్సన్‌గా షేక్ షబ్బీర్ బేగం, వైస్ చైర్మన్ గుందడి రాంరెడ్డి, గంభీరావుపేటకు చైర్‌పర్సన్‌గా కొమిరిశెట్టి విజయ, వైస్‌చైర్మన్ పత్తూరి అంజిరెడ్డి, పోతుగల్ మార్కెట్‌కు చైర్‌పర్సన్‌గా తలారి రాణి, వైస్ చైర్మన్ వేముల రాంరెడ్డి, పెద్దపల్లి చైర్‌పర్సన్‌గా ఈర్ల స్వరూప, వైస్ చైర్మన్‌గా  కూర మల్లారెడ్డి, జూలపల్లి చైర్మన్‌గా గండు సంజీవ్, వైస్ చైర్మన్ కొమ్మ పోచాలు, మల్లాపూర్ చైర్‌పర్సన్‌గా అనతడ్పుల పుష్పలత, వైస్ చైర్మన్ ఎట్టేడి నారాయణరెడ్డి, కూకట్‌పల్లి మార్కెట్ చైర్‌పర్సన్‌గా కే పుష్పరెడ్డి, వైస్ చైర్మన్ ప్రకాశ్ ముదిరాజ్, పెబ్బేరు చైర్‌పర్సన్ ఏ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ ఎం ఎల్లస్వామిగౌడ్, చేవెళ్ల మార్కెట్‌కు చైర్మన్ గడ్డమీది పెంటయ్య, వైస్ చైర్మన్ బేగరి రాములు, నారాయణపేట చైర్మన్‌గా ఆర్ శివారెడ్డి, వైస్ చైర్మన్‌గా కొనంగేరి హనుమంతు, కేసముద్రం గంట సంజీవరెడ్డి, వైస్ చైర్మన్‌గా పెద్దబోయిన అయిలయ్య, ధరూర్ కే విజయభాస్కర్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా లింగంపల్లి అశోక్, మర్పల్లి మార్కెట్‌కు ఎల్లనొళ్ల మహేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ జి. మల్లేశ్‌యాదవ్, గడ్డిఅన్నారం మార్కెట్‌కు చిలుక మధుసూదన్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా సీహెచ్ భాస్కరచారి నియమితులయ్యారు.