calender_icon.png 16 August, 2025 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వక్ఫ్ సమస్యలపై ఢిల్లీకి మహేశ్వరం రైతులు

21-09-2024 02:19:23 AM

అధ్యయనం చేస్తామన్న వక్ఫ్ సవరణ జేపీసీ చైర్మన్ 

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): వక్ఫ్ పేరిట తాము అన్యా యానికి గురయ్యామని తమను ఆదుకోవాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా మహేశ్వరానికి చెందిన బాధిత రైతులు ఢిల్లీ బాట పట్టారు. శుక్రవారం ఢిల్లీలో మహబూబ్ నగర్ ఎంపీ, వక్ఫ్ సవరణపై ఏర్పాటు చేసిన జేపీసీ సభ్యురాలు డీకే అరుణను కలిసి తమ సమస్యలను వివరించారు. తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. డీకే అరుణతో పాటు వెళ్లి వక్ఫ్ సవరణ జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) చైర్మన్ జగదాంబిక పాల్‌కు రైతులు వినతిపత్రం ఇచ్చారు. వక్ఫ్ బాధిత రైతుల వినతిపై చైర్మన్ సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఈ అంశంపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.