18న తెలంగాణ కాంగ్రెస్కు కొత్త ఇన్చార్జ్
16-09-2026 | 10:52am
హైదరాబాద్: ఈ నెల 18న తెలంగాణ కాంగ్రెస్కు(Telangana Congress) కొత్త ఇన్చార్జ్ నియామకం జరగనుంది. పార్టీ అధిష్టానం పలు రాష్ట్రాలకు కొత్త ఇన్చార్జ్ ల నియామకానికి కసరత్తు మొదలుపెట్టింది. ఏఐసీసీ త్వరలో ఇన్ ఛార్జ్ లను ప్రకటించనుంది. తెలంగాణ ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) ఉన్నత చదువుల కోసం పది నెలల పాటు లండన్ కు వెళ్తున్నారు. దీంతో ఆమె తన పదవి వీడనున్నారు. మీనాక్షి స్థానంలో కొత్త ఇన్ ఛార్జ్ ను అధిష్ఠానం ప్రకటించనుంది. కొత్త ఇన్ ఛార్జ్ కోసం పలువురి పేర్లను ఏఐసీసీ పరిశీలిస్తోంది. ఏఐసీసీ పరిశీలనలో మాజీ ఎంపీ చల్లా కుమార్(Former MP Challa Kumar)(తమిళనాడు), గుజరాత్ కు చెందిన ముగ్గురు నేతలు శక్తిసింగ్ గోయల్, దీపాదాస్ మున్షి, రోహిత్ చౌదరి పేర్లు ఉన్నారు. మరి తెలంగాణ ఇంచార్జ్ గా ఎవరు వస్తారో చూడాలి మరి