13 March, 2026 | 3:56 PM

నిరుపేదల సొంతింటి కల సాకారం

13-03-2026 01:59 PM

కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీరా శ్యామ్ నాయక్

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తోందని ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇంచార్జి అజ్మీరా శ్యామ్ నాయక్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎన్‌జీఓ కాలనీలో మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్, మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్, కౌన్సిలర్ అబ్దుల్లా, మార్కెట్ కమిటీ చైర్మన్ మంగ, మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు రఫ్ఫు తదితరులతో కలిసి  బాలే రావు రేణుక బాయి–భారత్ దంపతుల నూతన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు.

ఈ సందర్భంగా  అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. త్వరలోనే రెండు మూడు విడతల్లో మరిన్ని ఇళ్లను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ జిల్లా నాయకుడు ఆసిఫ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వైరగడే గోవింద్, నిఖిల్, ఆసిఫ్, సఫాన్, పార్టీ కార్యకర్తలు,స్థానికులు పాల్గొన్నారు.