13 March, 2026 | 3:11 PM

గో-వృషభ కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి దంపతులు

13-03-2026 01:57 PM

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ పట్టణ పరిధిలోని ఎండబెట్ల గ్రామంలో నిర్వహించిన గో–వృషభ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి సతీమణి డా. సరిత రాజేష్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు గోపూజ నిర్వహించి గోమాతకు ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాదాలు పొందారు. అనంతరం గ్రామ ప్రజలతో కలిసి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, మునిసిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, వైస్ చైర్మన్ బాదం రమేష్, స్థానిక కౌన్సిలర్లు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, భక్తులు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.