13 March, 2026 | 4:08 PM

ప్రాణాలతో చెలగాటం వద్దు..

13-03-2026 02:02 PM

వైద్యులకు, ల్యాబ్ టెక్నీషియన్లకు "ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్" సూచన.. 

షాద్ నగర్ లో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ 

షాద్‌నగర్,(విజయక్రాంతి): తప్పుడు రిపోర్టులు ఇవ్వకండి.. సమాజం కోసం బాధ్యతగా పనిచేయండి.. అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్(MLA Veerlapally Shankar) వైద్యులకు, ల్యాబ్ టెక్నీషియన్లకు సూచించారు. షాద్ నగర్ పట్టణంలోని బుగ్గారెడ్డి గార్డెన్ లో బుగ్గారెడ్డి ఆసుపత్రి, తెలంగాణ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ల (టిడిఏ) ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రుల నిర్వాహకులు, వైద్యులు తమ ఆశలు తగ్గించుకొని సామాన్యులకు వీలైనంత తక్కువ ధరకు వైద్యం అందించాలని సూచించారు.

ల్యాబ్ టెక్నీషియన్లు గతంలో  వైద్యులను రోగులు రెండో దైవంగా భావిస్తారని, అలాంటి రోగుల విషయంలో డబ్బులకు కక్కుర్తి పడకుండా కొన్నిసార్లు శివ భావంతో పనిచేయాల్సి ఉంటుందని అన్నారు. కొన్ని కార్పొరేట్ హాస్పిటల్లో చనిపోయాక కూడా బ్రతికున్నాడని ఆశపెట్టి డబ్బులు వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయని, అలాంటి స్థాయికి దిగజార వద్దని సూచించారు. ఇంత కష్టపడి చదివిన వైద్యులు సమాజానికి ఉపయోగపడాలని ఆయన సూచించారు.

డాక్టర్ అనురాగరెడ్డి తాత బుగ్గారెడ్డి ఈ రోజున లేకపోయినా ఆయన పేరుమీద ఇక్కడ ఓ ఆసుపత్రి ఉందని గుర్తు చేశారు.  అదేవిధంగా ల్యాబ్ టెక్నిక్ అసోసియేషన్ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. అనవసరమైన టెస్టులతో సామాన్యులను ఇబ్బంది పెట్టవద్దని అన్నారు. డబ్బు ఎలాగైనా సంపాదించవచ్చని, కానీ రాష్ట్రపతిగా ఉండి కూడా రూపాయి సంపాదించుకొని అబ్దుల్ కలాంకు, అడ్డగోలుగా దేశాన్ని కొల్లగొడుతున్న ఆదాని ,అంబానీలకు తేడా ఉంటుందని గుర్తు చేశారు. అబ్దుల్ కలాం, గాంధీ, నెహ్రూ లాంటి మహనీయులను మనం ఎందుకు గౌరవిస్తామో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు.

తప్పుడు రిపోర్టులు ఇవ్వద్దు - డాక్టర్ విజయలక్ష్మి 

ల్యాబ్ టెక్నీషియన్ పై ఎంతో గురుదరమైన బాధ్యత ఉంటుందని, వారు తప్పుడు రిపోర్టులు ఇవ్వొద్దని డిప్యూటీ డిఎంఅండ్ హెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి హితవు పలికారు. కొంతమంది లాప్ టెక్నీషియన్లు అనుభవలేమితో పేషంట్లకు తప్పుడు రిపోర్టులు ఇచ్చారని దీనివల్ల తప్పుడు వైద్యం వారికి అందుతుందని దానివల్ల ప్రాణాపాయ పరిస్థితి వస్తుందని అన్నారు. చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.  ఈ కార్యక్రమ్ లో  మున్సిపల్ చైర్మన్ అగ్గునూరు బస్వం, డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ విజయ లక్ష్మి, కృష్ణారెడ్డి, మురళి మోహన్ అప్పి, జిల్లా అధ్యక్షులు అరవింద్  తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు..