calender_icon.png 30 May, 2025 | 11:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగు యూనివర్సిటీకి కొత్త లోగో

29-05-2025 03:23:16 AM

- ఆవిష్కరించిన ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి

హైదరాబాద్, మే 28 (విజయక్రాంతి): సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నూతన లోగోను బుధవారం ఆవిష్కరించారు. యూనివర్సిటలోని ఆడిటోరియంలో నిర్వహించిన సురవరం ప్రతాపరెడ్డి 129వ జయంతి సభలో రాష్ర్ట ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సురవరం ప్రతాపరెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలంగాణ పోరాటం, సామాజిక స్ఫూర్తి ప్రధాత, అంత గొప్ప వ్యక్తి పేరు తెలుగు యూనివర్సిటీకి పెట్టడం హర్షనీయమన్నారు. సురవరం ప్రతాపరెడ్డి పేరు ఉమ్మడి రాష్ర్టంలోనే తెలుగు యూనివర్సిటీకి పెట్టాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి ఆ చర్యలు తీసుకోవడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, తెలంగాణ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎల్లూరి శివారెడ్డి, తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వెలుదండ నిత్యానందరావు, అసిస్టెంట్ డైరెక్టర్ రామ్మూర్తి, ప్రముఖ కవి, రచయిత సంగిశెట్టి శ్రీనివాస్, సురవరం ప్రతాపరెడ్డి కుమారులు సురవరం విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.