17 April, 2026 | 9:37 PM

Breaking News

అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •   విద్యుత్ షాక్‌తో పశువు మృతి   •  

బాంచన్ సార్.. వడ్లు కొనండి

29-05-2025 03:21 AM

మహబూబాబాద్/నిర్మల్, మే 28 (విజయక్రాంతి)/బైంసా: మహబూబాబాద్ జిల్లా నర్సింహులుపేటలో మహిళా రైతులు తహసీల్దార్ కాళ్లు పట్టుకుని ధాన్యం కొనండని మొరపెట్టుకున్నారు.

ఖరీప్ సీజన్ ప్రారంభమైనా యాసంగికి సంబంధించిన ధాన్యం ఇంకా కొనుగోలు కేంద్రాల్లోనే ఉండటంతో రైతులు ఆందోళనకు దిగుతున్నారు. ధాన్యం ఇంకెప్పుడు కొంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పిచ్చిరామ్ తండాకు చెందిన భూక్య గోరి, భూక్య ఈరి నెల రోజులుగా ధాన్యం అమ్మేందుకు కొనుగోలు కేంద్రంలోనే నిరీక్షిస్తున్నా పట్టించుకోవడంలేదని బుధవారం ఆందోళనకు దిగారు.

ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ రమేశ్‌బాబు అక్కడికి చేరుకోగా, మహిళా రైతులిద్దరూ తహసీల్దార్ కాళ్లు పట్టుకొని “బాంచన్ సార్.. మీ కాళ్లు మొక్కుతాం.. మా వడ్లు కొనండి సార్‌” అంటూ తహసీల్దార్ కాళ్లు పట్టుకొని వేడుకున్నారు. “నీ బాంచన్ సార్.. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించి మాకు డబ్బులు ఇప్పిస్తే వానాకాలం పంట సాగు చేసుకుంటాం” అని వేడుకున్నారు.

“వానలు పడుతున్నయ్.. వానాకాలం నార్లు పోసుకోవాలి.. మా వడ్లు జర తొందరగా తీసుకోండి” అంటూ వేడుకున్నారు. తహసీల్దార్ వారిని వారించి, కొనుగోలు కేంద్రం లో ఉన్న ధాన్యం వెంటనే తరలిస్తామని హా మీ ఇచ్చారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యా న్ని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా దం తాలపల్లి ప్రధాన రహదారిపై గున్నేపల్లి వద్ద రైతులు రాస్తారోకో చేశారు.

నిర్మల్ జిల్లాలోని నిర్మల్ రూలర్ మండలం మూటాపూర్ గ్రామంలో ఆదముళ్ల శ్రీధర్ అనే రైతు ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై ఆక్రోశం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి తెచ్చి 20 రోజులైనా తేమ సాకు తో కొంటలేరని బుధవారం ముఠాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కొనుగోలు కేంద్రం ఎదుట ధాన్యం బస్తాలపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు.

వర్షాల వల్ల ధాన్యం తడిసిపోతుంటే కొనుగోలు ఆలస్యం చేయడంతో పదేపదే ఆరబెట్టాల్సి వస్తున్నదంటూ పంట అమ్ముడు కంటే అగ్గిపెట్టడమే మేలు అంటూ నిరసన తెలుపుతూ ధాన్యం బస్తాలకు నిప్పు పెట్టారు. పీఏసీఎస్ చైర్మన్ గంగాధర్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కిరణ్ కుమార్, పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు.

సూ ర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి) మండల పరిధిలోని బొల్లంపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేం ద్రంలో నెలరోజులు దాటినా ధాన్యం కొంటలేరని రైతులు బుధవారం నకిరేకల్- సిరోంచి (365) జాతీయ రహదారిపై మొలకెత్తిన వడ్లతో ధర్నా చేశారు.

అలాగే సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్ వజ్ర రైస్‌మిల్‌లో ధాన్యం వెంటనే అన్‌లోడ్ చేయ క కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు వేయడం లేదని పలువురు రైతులు ధర్నాకు దిగారు. అధికారులు వచ్చి నచ్చడంతో రైతులు ఆం దోళన విరమించారు. నిర్మల్ జిల్లా బైంసా మండలంలోని కత్తిగాం గ్రామంలో వర్షాల కారణంగా తడిసిపోయిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని కోరుతూ బుధవారం బైం సా పట్టణంలో రైతులు రాస్తారోకో చేశారు.