calender_icon.png 2 February, 2026 | 1:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోర్డాన్‌లో కొత్త షెడ్యూల్!

30-01-2026 12:00:00 AM

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వచ్చిన ‘దేవర’ చిత్రం 2024లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీనికి సీక్వెల్ ఉన్నట్టు తొలిభాగం ఎండింగ్‌లో ప్రకటించిన మేకర్స్ తాజా గా ఇందుకు సంబంధించి అప్‌డేట్‌ను పంచుకు న్నారు. ఈ ఏడాది మే నెలలో ‘దేవర2’ పనులు ప్రారంభం కానున్నాయని, వచ్చే ఏడాది సినిమాను విడుదల చేస్తామని చిత్ర నిర్మాతల్లో ఒకరైన మిక్కిలినేని సుధాకర్ ఇటీవల ప్రకటించారు. ఈ వార్తతో సంబురపడిపోతున్న యంగ్ టైగర్ అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసే మరో వార్త ఇప్పుడు వినవ స్తోంది.

ఎన్టీఆర్ హీరోగా డైరె క్టర్ ప్రశాంత్ నీల్ ఓ సిని మాను తెరకెక్కిస్తున్న సంగ తి తెలిసిందే. ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ విదేశాల్లో ప్రారంభం కానున్నట్టు సమాచారం. ఈ మూవీ కొత్త షెడ్యూల్ ఫిబ్రవరి 5 నుంచి జోర్డాన్ దేశంలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అక్కడ హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులను చిత్రీకరించనున్నారట.

ఈ కీలక షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే, షూటింగ్ ప్రారంభానికి 2-3 రోజుల ముందే ఎన్టీఆర్ జోర్డాన్‌కు చేరుకోనున్నార ట. అక్కడి వాతావరణానికి అలవాటుపడటం, తన పాత్రకు సంబంధించిన మేకోవర్ కోసం మ్యాన్ ఆఫ్ మాసెస్ ముందే అక్కడికి వెళ్తున్నారట. 

ఎన్టీఆర్ వ్యక్తిత్వ హక్కులకు ఢిల్లీ హైకోర్టు రక్షణ 

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ వ్యక్తిత్వ, ప్రచార హక్కులను రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ మాధ్యమాల్లో తన పేరు, ఫొటోలు, గుర్తింపును అనుమతి లేకుండా వాణిజ్యపరమైన ప్రయోజనాల కోసం వాడుతున్నారని ఎన్టీఆర్ కోర్టును ఆశ్రయిస్తూ పిటిషన్ వేశారు. ఈ విషయాన్ని పరిశీలించిన కోర్టు.. ఎన్టీఆర్ అనుమతి లేకుండా ఆయన పేరు, ఫొటోలు, వీడియోలు వాడొద్దని ఆదేశించింది.

జూనియర్ ఎన్టీఆర్ ఇండియాలో పెద్ద సెలబ్రిటీ అని స్పష్టం చేసిన కోర్టు.. ఎన్నో ఏళ్ల కెరీర్‌తో ఆయన ఈ మంచి పేరు సంపాదించుకున్నారని తెలిపింది. ప్రజలకు ఆయన పేరు, ఫోటో, రూపం అంటే వెంటనే ఎన్టీఆర్ (సీనియర్) గుర్తొస్తారని చెప్పింది. అందుకే ఆయన పేరు, ఇమేజ్ మీద హక్కులు ఆయనకే ఉంటాయని కోర్టు అభిప్రాయపడింది. ఎన్టీఆర్ పేరు ప్రతిష్ఠలకు నష్టం కలిగించేలా ప్రవరిస్తే చట్టపరమైన కఠిన చర్యలు అమలవుతాయని కోర్టు ఆదేశాల్లో పేర్కొంది.