calender_icon.png 2 February, 2026 | 12:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ పెద్ద పండుగకు ఫౌజీ

30-01-2026 12:00:00 AM

ఒకటి పూర్తవుతుండగానే మరో సినిమాతో బిజీ అవుతున్నారు స్టార్ హీరో ప్రభాస్. దీంతో ఆయన సినిమాల వార్తల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ‘ఫౌజీ’ మేకర్స్ ఓ శుభవార్తను ప్రకటించారు. తమ సినిమాను దసరా బరిలో నిలుపనున్నట్టు వెల్లడించారు. అయితే, ఖచ్చితమైన తేదీని మాత్రం నిర్మాతలు ప్రకటించలేదు. ఏదేమైనా తెలంగాణ పెద్ద పండుగ బరిలో తమ అభిమాన హీరో సినిమా నిలువడం పట్ల రెబల్ ఫ్యాన్స్ సంబురంగా ఉన్నారు.

ప్రభాస్ కథానాయకుడిగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ పాన్-ఇండియా ప్రాజెక్టును మైత్రి మూవీ మేక ర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తుండగా, టీ -సిరీస్ గుల్షన్‌కుమార్, భూషణ్‌కుమార్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. షూటింగ్ పూర్తయ్యే వరకు ఎలాంటి విరామం లేకుండా షెడ్యూల్ కొనసాగించనున్నట్టు టీమ్ తెలిపింది.

ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇమాన్వీ నటిస్తోంది. అనుప మ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భానుచందర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో విడుదల కానున్న చిత్రానికి డీవోపీ: సుదీప్ చటర్జీ ఐఎస్‌సీ; సంగీతం: విశాల్ చంద్రశేఖర్; ఎడిటర్: కోటగిరి వేంకటేశ్వరరావు; ప్రొడక్షన్ డిజైన్: అనిల్ విలాస్ జాదవ్.