వృద్ధాప్యం గడిపేద్దాం.. ఉత్సాహంగా!
వృద్ధాప్యంలో శరీరం సహజమైన మార్పులను ఎదుర్కొంటుంది. ఇవి ఆరోగ్యంపై ప్రభా వం చూపించవచ్చు. అయితే, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుంటే, ఈ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. మన వృద్ధాప్యాన్ని ఆనందంగా గడపడమేకాక దానిని పరిపూర్ణతతో స్వీకరించగలం. వయసు పెరుగుతూనే శరీరం లో అనేక మార్పులు సంభవిస్తాయి. చర్మం పలుచగా మారి పొడిబారే అవకాశం ఉంటుం ది. ఎముకల దృఢత్వం తగ్గి విరిగే ప్రమాదం పెరుగుతుంది. హార్మోన్ల సమతుల్యత మారిపోవడంతో ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం అధికమవుతుంది. అలాగే, భావేంద్రియ వ్యవస్థ ప్రభావిత మై చైతన్యం తగ్గడం, భోజనరుచి మారడం, వా సన, దృష్టి, వినికిడి తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. నిద్రలో మార్పులు, జ్ఞాపకశక్తి తగ్గడం, మతిమరపు, పార్కిన్సన్ వంటి వ్యాధులకూ ఒకింత అవకాశం ఉంటుంది.
వృద్ధాప్యంలో ఒంటరితనం, ఆర్థిక సమస్యలు, జీవనశైలి మార్పులు మానసిక ఒత్తిడిని పెంచుతాయి. అయితే, మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరిచే చర్యలు తీసుకోవడం ద్వారా ఈ దశను సంతోషంగా గడపవచ్చు. పోషకాహారంతో కూడిన ఆహారం (పండ్లు, కూరగాయ లు, గింజలు), క్రమం తప్పని వ్యాయామం (నడక, యోగా) శరీరాన్ని ఒకింత దృఢంగా ఉంచుతాయి. అవసరమైన వ్యాక్సినేషన్లు, వైద్య పరీక్షలు చేయించుకోవడమూ ముఖ్యం. మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు మిత్రుల తో మమేకమవుతూ అభిరుచులను వృద్ధి పరచుకోవాలి. సేవా కార్యక్రమాలు, ధ్యానం, సాను కూల ఆలోచనలు వంటివీ వృద్ధాప్యాన్ని ఉల్లాసంగా మారుస్తాయి. పరస్పరం అ నుభవాల ను పంచుకుంటూ, కొత్త విషయాల ను నేర్చుకుంటూ ఉంటే రాబోయే కాలాన్ని సం పూర్ణంగా ఆస్వాదించగలం. అందుకే, ఇప్పుడే ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రారంభిద్దాం.
డా.కృష్ణకుమార్ వేపకొమ్మ






