calender_icon.png 7 January, 2026 | 9:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

04-01-2026 12:00:00 AM

హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): బోధ లక్ష్మారెడ్డి సూచన మేరకు శని వారం తెలంగాణ రాష్ట్రం న్యాయ శాఖ ఉద్యోగుల సంఘం నూతన డైరీ,  క్యాలెండర్‌ను చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ తన నివాసంలో ఆవిష్కరించారు. న్యాయ శాఖ ఉద్యోగుల సమస్యల గురించి ప్రధానంగా న్యాయశాఖ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న అనేక బిల్లుల గురించి ఎస్‌వి సుబ్బయ్య రాష్ట్ర అధ్యక్షుడు, వి.వి. రమణ రావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వివరించారు.

ఆయన సానుకూలంగా స్పందించి గతంలో మీరు ఇచ్చిన అర్జీని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వానికి తెలియజేశానని, మరొక్కసారి ప్రభుత్వా నికి బిల్లులు మంజూరు చేయాలని ఆదేశిస్తాను అని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో సిరిసిల్లలో చేనేత కార్మికులు నేసిన అగ్గిపెట్టెలో శాలువాను ప్రధాన కార్యదర్శి రమ ణరావు బహుకరించారు. కార్యక్రమంలో ప్రే మ్ కుమార్, గౌరెడ్డి కోటేశ్వర్‌రెడ్డి, కొడుమూ ర్ నల్లా రెడ్డి, వీరబాబు, ఉదయ్ కుమార్, నరేష్ యాదవ్, రాకేష్ పాల్గొన్నారు.