calender_icon.png 9 January, 2026 | 12:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏనుగుల సత్యనారాయణకు సన్మానం

04-01-2026 12:00:00 AM

హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి) : తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసి యేషన్ కేంద్ర ప్రధాన కార్యదర్శి ఏనుగుల సత్యనారాయణ పదవి విరమణ ఆత్మీయ అభినంద న సభ శనివారం ఖమ్మం జిల్లా టీజీవో అధ్యక్ష, కార్యదర్శులు కొంగర వెంకటేశ్వరరావు, మోదుగు వేలాద్రి అధ్యక్షతన నిర్వ హించారు. సభ్యులు హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ..

సత్యనారాయ ణ టీజీవో సంఘం వ్యవస్థాపన జరిగిన నాటి నుంచి ఎంతో క్రమశిక్షణతో కేంద్ర సం ఘాన్ని నడిపించారని తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాల నుండి ప్రాథమిక సభ్యులు వచ్చిన వారి సమస్యలను సాధనకై విశేష కృషి చేశారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన లో టీజీవో చేసిన కృషిలో సత్యనారాయణ గారి పాత్ర మరువలేనిదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

కేంద్ర సంఘ సభ్యులు కొండపల్లి శేషు ప్రసాద్ అసోసియేట్ అధ్యక్షులు మల్లెల రవీంద్ర ప్రసాద్ గంగవరపు నరేందర్, హౌస్ బిల్లింగ్ సొసైటీ డాక్టర్ పి విజ య్ కుమార్, వెటర్నరీ గెజిటెడ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మన్యం రమేష్ బా బు, సం జయ్ రెడ్డి కార్యవర్గ సభ్యులు తమ్మిశెట్టి శ్రీనివాస్, ఎంపీఓ శాస్త్రి  అసోసియేట్ అధ్యక్షులు వేల్పుల శ్రీనివాసు, మెడికల్ ఫోరం బాధ్యు లు నరసింహారావు తదితరులు హాజరైనారు.