3 May, 2026 | 1:49 AM

కివీస్‌దే చివరి టీ20

03-05-2026 12:33 AM

బంగ్లాపై సిరీస్ సమం

ఢాకా, మే 2: బంగ్లాదేశ్ పర్యటనను న్యూజిలాండ్ విజయంతో ముగించింది. టీ20 సిరీస్‌ను సమం చేసింది. వర్షం కారణంగా 15 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 14.2 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో తౌహిద్ హృదోయ్ (33) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

కివీస్ బౌలర్లలో జోష్ క్లార్క్సన్ 3 వికెట్లు తీయగా, నాథన్ స్మిత్, బెన్ సియర్స్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం న్యూజిలాండ్ 11.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 104 పరుగుల టార్గెట్‌ను అందుకుంది. బెవన్ జాకబ్స్ (62 నాటౌట్) అజేయ అర్థసెంచరీతో జట్టును గెలిపించాడు. తొలి టీ20లో బంగ్లాదేశ్ గెలవగా.. రెండో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అటు వన్డే సిరీస్‌ను బంగ్లా గెలుచుకుంది.

ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ క్రికెటర్ ఇష్ సోదీ చరిత్ర సృష్టించాడు. కివీస్ తరపున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌ లర్‌గా నిలిచాడు. బంగ్లా బ్యాటర్ షమ్మీ హొ సేన్ను ఔట్ చేయడం ద్వారా సోదీ ఈ ఘనత సాధించాడు. ఇప్పటివరకు 141 మ్యాచ్‌లలో 8.16 ఎకానమీ రేటుతో 165 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు కివీస్ తరఫున టీ20ల్లో అత్యధిక సార్లు నాలుగు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన బౌలర్‌గానూ నిలిచా డు. ఇప్పటివరకు నాలుగుసార్లు నాలుగు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.  ఇక రెం డో స్థానంలో టిమ్ సౌథీ ఉన్నాడు.