2 May, 2026 | 3:55 AM

రఫ్ఫాడించిన రాహుల్

02-05-2026 02:39 AM

రాజస్థాన్‌కు ఢిల్లీ షాక్

హైస్కోరింగ్ మ్యాచ్‌లో డీసీ జోరు

సీజన్‌లో నాలుగో విజయం

ఆకట్టుకున్న మిఛెల్ స్టార్క్

ఐపీఎల్ 19వ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుస పరాజయాలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. హ్యాట్రిక్ ఓటముల తర్వా త పుం జుకున్న ఢిల్లీ రాజస్థాన్ రాయల్స్‌కు షాకిచ్చింది. హై స్కోరింగ్ మ్యాచ్‌లో అదరగొట్టిన ఆ జట్టు 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. బౌలింగ్‌లో మిఛెల్ స్టార్క్, బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్, నిస్సాంక అదరగొట్టారు. 

జైపూర్, మే 1 : ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఫామ్‌లో ఉన్న జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ త్వరగానే ఔటయ్యారు. కేవలం 12 పరుగులకే ఓపెనర్లు వికెట్లు చేజార్చుకుంది. దీంతో కనీసం 150 పరుగులైనా చేస్తుందా అనుకున్నారు.

ఈ దశలో రియాన్ పరాగ్, జురెల్ రాజస్థాన్ ను ఆదుకున్నారు. ఈ సీజన్ లో ఇప్పటి వరకూ పెద్దగా ఆడని పరాగ్ కెప్టెన్ ఇన్నిం గ్స్‌తో ఆకట్టుకున్నాడు. జురెల్‌తో కలిసి మూడో వికెట్‌కు 102 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జురెల్ 42 పరుగులకు ఔటైనా పరాగ్, జడేజాతో కలిసి హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పా డు.

జడేజా (20) ఔటైన తర్వాత పరాగ్ కూడా 50 బంతుల్లో 90 (8 ఫోర్లు, 5 సిక్స ర్లు) పరుగులకు ఔటయ్యాడు. రాజస్థాన్ స్కోరు 200 దాటుతుందా అనిపిస్తున్న స మయంలో డోనోవన్ ఫెరీరా శివతాండవం చేశాడు. కేవలం 13 బంతుల్లోనే 2 ఫోర్లు, 6 భారీ సిక్సర్లతో విరుచుకుపడి 47 పరుగులు సాధించాడు. డెత్ ఓవర్లలో ఫెరీరా మెరుపు వేగంతో బ్యాటిం గ్ చేయడంతో రాజస్థాన్ స్కోరు బోర్డు ఒక్కసారిగా పరుగెత్తింది. దీంతో రా జస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ముందు 226 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీసినప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అక్షర్ పటేల్, కైల్ జేమీసన్, నటరాజన్ త లో వికెట్ తీశారు. దీంతో రాజస్థాన్ రా యల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 225 పరుగులు చేసింది. ఈ సీజ న్‌లో తొలి మ్యాచ్ ఆడిన మిఛెల్ స్టార్క్ 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఛేజింగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడిం ది. ఓపెనర్లు నిస్సాం క, కెఎల్ రాహుల్ దుమ్మురేపారు.

రాజస్థాన్ బౌలర్లను ఆటాడుకున్న వీరిద్దరూ తొలి వికెట్ కు 110 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నా రు. నిస్సాంక 33 బంతుల్లో 62 (6 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు చేయగా.. రాహుల్ దూకుడు కొనసాగించాడు. నితీశ్ రా ణాతో కలిసి 61 పరుగులు జోడించాడు. రాణా 17 బంతుల్లో 33 రన్స్ కు ఔటవగా.. కెఎల్ రాహుల్ 40 బంతుల్లో 75 (6 ఫోర్లు , 5 సిక్సర్లు) పరుగులు చేశాడుయ తర్వాత స్టబ్స్ (18) , అశుతోష్ శర్మ (25) నాటౌట్ గా నిలిచి జట్టు విజయాన్ని పూర్తి చేశారు.

ఈ సీజన్ లో ఢిల్లీకి ఇది నాలు గో విజయం. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ పోరాటం వృథా కాగా.. ఢిల్లీ తన చరిత్రలోనే అత్యుత్తమ ఛేజింగ్‌ను నమోదు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో రవీంద్ర జడేజా, తుషా ర్ దేశ్‌పాండే వికెట్లు తీసినప్పటికీ.. ఢిల్లీ బ్యాటర్ల జోరును ఆపలేకపోయారు. కేఎల్ రాహుల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అత్యంత పోటీగా సాగిన ఈ మ్యాచ్ ఐపీఎల్ 2026లోనే అత్యుత్తమ మ్యాచ్‌లలో ఒకటిగా నిలిచింది.

స్కోరు బోర్డు

రాజస్థాన్ రాయల్స్  ఇన్నింగ్స్ : 225/6 ( పరాగ్ 90, జురెల్ 42, ఫెరీరా 47; స్టార్క్ 3/40, అక్షర్ పటేల్ 1/39 )

ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ : 226/3 ( నిస్సాంక  62, కెఎల్ రాహుల్ 75, నితీశ్ రా ణా 33, అశుతోష్ శర్మ 25 నాటౌట్ ; ఆర్చర్ 1/46, దేశ్‌పాండే 1/38 )