18 August, 2026 | 1:27 AM

నిధి మైథాలజీ థ్రిల్లర్ షురూ

18-08-2026 12:22 AM

ఇప్పటివరకు ఎక్కువగా గ్లామర్ పాత్రలతో అలరించిన అందాల తార నిధి అగర్వాల్ ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆమె హీరోయిన్‌గా వరాహ్ ఫిలమ్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్న ఈ మైథాలజీ థ్రిల్లర్‌ను మేకర్స్ సోమవారం లాంచ్ చేశారు.

ఈ చిత్రానికి సునీత్ పడోల్కర్ నిర్మాత కాగా, ‘తంత్ర’ ఫేమ్ శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవంలో పీ అశోక్, పీ రేణుక, హుర్మత్ సర్నా, హీరోయిన్ నిధి అగర్వాల్, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. పోస్టర్‌లో నిధి అగర్వాల్ లుక్ చాలా ఆకర్షణీయంగా, ఇప్పటివరకు ఆమె కనిపించని కొత్త అవతార్‌ను పరిచయం చేసేలా ఉంది. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలను మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.