calender_icon.png 11 February, 2026 | 5:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీలోఫర్ నుంచి నీలోఫర్ చత్ ప్రారంభం

11-02-2026 02:10:39 AM

శాకాహార రుచులతో ప్రీమియం డైనింగ్ 

హైదరాబాద్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో విశ్వసనీయమైన, ప్రసిద్ధ ఆహార బ్రాండ్‌గా గుర్తింపు పొందిన నీలోఫర్.. తన తాజా వంటకాల గమ్యస్థానం గా ‘నీలోఫర్ చత్’ను రోడ్ నంబర్ 12, బం జారాహిల్స్‌లో ఘనంగా ప్రారంభించింది. ఆకర్షణీయమైన రూఫ్‌టాప్ వేదికపై నిర్వహించిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖులు, ఆహార ప్రియులు, నీలోఫర్ అభిమానులు హాజరయ్యారు.

కేఫే నీలోఫర్ వ్యవస్థాపకులు, చైర్మన్ అనుముల బాబురావు, మేనేజింగ్ డైరెక్టర్ అనుముల శశాంక్ మాట్లాడుతూ.. ‘నీలోఫర్ చత్ మా ప్రయాణంలో సహజమైన విస్తరణ. నాణ్యత, నమ్మ కం పట్ల మా కట్టుబాటుకు ఇది ప్రతిబింబం. హైదరాబాద్ ప్రజల హృదయాలకు దగ్గరైన నీలోఫర్ బ్రాండ్, ఈ కొత్త కాన్సెప్ట్ ద్వారా శాకాహార వంటకాలను మరింత ఉన్నత అనుభవంగా అందించాలనే లక్ష్యంతో ముం దుకు సాగుతోంది” అని తెలిపారు.

ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. ‘నీలోఫర్ అంటే హైదరాబాద్‌కు నాణ్యతకు, స్థిరత్వానికి ప్రతీక. నీలోఫర్ చత్ ప్రారంభం ద్వారా ఒక వారసత్వ బ్రాండ్ ఎలా తన మూలాలను కాపాడుకుంటూనే కొత్త ఆవిష్కరణ లకు దారితీస్తుందో చక్కగా చూపించింది” అని అన్నారు. కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు.