calender_icon.png 5 July, 2025 | 5:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్ సవాల్ స్వీకరించిన కేటీఆర్

05-07-2025 12:53:09 PM

  1. కేసీఆర్ ప్రభుత్వం చేసినట్లు రైతులకు ఎవరూ చేయలేదు.
  2. రేవంత్.. మేము చర్చకు రెడీ
  3. నీకు దమ్ముంటే 8వ తారీఖు నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు రా!
  4. రేవంత్ సవాల్ ను స్వీకరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
  5. రేవంత్ రెడ్డి నువ్వు ఎప్పుడు ఎక్కడ చర్చ పెట్టినా మేము సిద్ధం

హైదరాబాద్: బనకచర్ల ద్వారా గోదావరి నీటిని తీసుకెళ్తుంటే మీరు వంతపాడుతున్నారు.. దేవాదుల గోదావరి బేసిన్ లో ఉందా ఎవరైనా అడుగుతారా.. రేవంత్ రెడ్డికి నదులు, బేసిన్ల గురించి కూడా తెలియదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎద్దేవా చేశారు. నల్లమల తెలంగాణలోనే ఉందా అని కూడా అడుగుతున్నారు.. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో మేం ఉద్యమం నడిపామని కేటీఆర్ స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వచ్చాక నీళ్లను ఆంధ్రాకు.. నిధులను ఢిల్లీకి పంపుతున్నారు ఆయన ఆరోపించారు.

కేసీఆర్ ప్రభుత్వం చేసినట్లు రైతులకు ఎక్కడా, ఎవరూ చేయలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో మేం నిధులు వేశాం.. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని ఆయన తేల్చిచెప్పారు. ఎరువులు, విత్తనాల కోసం లైన్తలో చెప్పులు పెట్టడమేనా ఇందిరమ్మ రాజ్యం అంటే.. కొమురం జిల్లాలో ఎరువుల బస్తా కోసం రైతులు అనేక బాధలు పడుతున్నారని వాపోయారు. ఎరువులు పంపిణీ చేతకాని మీరు.. కేసీఆర్ ను చర్చకు పిలుస్తారా? అని ప్రశ్నించారు. 

రైతులకు పెట్టుబడి, ఉచిత విద్యుత్, వాగులు నింపిన ఘనత కూడా కేసీఆర్ దే అన్నారు. రైతు చనిపోతే కేసీఆర్ ప్రభుత్వం రూ. 5 లక్షల బీమా ఇచ్చిందని గుర్తుచేశారు. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో చెరువులను ధ్వంసం చేశారని మండిపడ్డారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు జీవం పోసిన ఘనత మాదే అన్నారు. రూ. 30 వేల కోట్ల విలువైన మత్స్య సంపద సృష్టించింది మేమే అన్నారు. రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాణిగా మార్చింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. 

పాలమూరును 90 శాతం మేం పూర్తి చేశాం.. మిగతా 10 శాతం మీరు చేయలేకపోయారని విమర్శించారు. రైతుల బాగు గురించి కాంగ్రెస్ మాట్లాడటం.. దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందన్నారు. కొత్త రాష్ట్రానికి కేంద్రం అనేక ఇబ్బందులు పెట్టినా కేసీఆర్ నిలబడ్డారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ వరంగల్ లో చెప్పిన రైతు డిక్లరేషన్ లో ఒక్కటైనా అమలైందా.. వ్యవసాయంపై మీరు ఎక్కడ చర్చ పెట్టినా మేం సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు. మీ సవాల్ స్వీకరిస్తా.. నేను చర్చకు వస్తా మీరు సిద్ధమా అన్నారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఈ నెల 8న సిద్ధంగా ఉంటా.. ధైర్యం ఉంటే రావాలన్నారు.