05-07-2025 12:22:21 PM
చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్..
నేరడిగొండ,(విజయక్రాంతి): పేద ఆడ బిడ్డల పెళ్ళిళ్లకు అండగా నిలిచేలా మాజీ సీఎం కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) కళ్యాణ లక్ష్మీ,(Kalyana Lakshmi ) షాది ముబారక్ పథకాలు తీసుకొచ్చారని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని రైతు వేదికలో శనివారం కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... లబ్ధిదారులు పథకాల లబ్ధి పొందేందుకు మధ్య దళారులను నమ్మవద్దన్నారు. నేరుగా లబ్ధిదారులకు పథకాలు అందేలా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు బొడ్డు గంగారెడ్డి, బోథ్ బ్లాక్ ఆత్మ చైర్మన్ గొర్ల రాజు యాదవ్, డైరెక్టర్లు, పలువురు బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.