14 May, 2026 | 7:14 PM

తొమ్మిది షాపులు.. 16 లక్షల బకాయిలు

27-08-2024 12:44 AM
  1. బినామీ పేర్లతో అక్రమార్కుడి లీలలు
  2. వేలం పాడుకుని సొమ్ము చెల్లించడంలో జాప్యం
  3. గడువు పూర్తయినా దుకాణాలు ఖాళీ చేయని బినామీలు
  4. ‘మామూలు’గా తీసుకుని మిన్నకుంటున్న ఆలయ అధికారులు

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 26 (విజయక్రాంతి): భద్రాద్రి జిల్లా పాల్వంచ మండ లంలోని కేశవాపురొం జగన్నాథపురం మ ధ్య ఉన్న పెద్దమ్మతల్లి ఆలయం భక్తుల పాలి ట కొంగు బంగారం. ఆలయానికి వారాంతంలో వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఇక పండుగల సమయంలోనైతే చెప్పనక్కర్లే దు.. భద్రాద్రి జిల్లా నుంచే పొరుగు జిల్లాల నుంచీ భక్తులు తరలివస్తారు. దీంతో ఆలయ పరిసరాల్లోని దుకాణ సముదాయాలకు ఫు ల్ గిరాకీ. ఆలయ పరిధిలోని కాంప్లెక్సు దు కాణాలకు ఏటా వేలం జరుగుతుంది. సాధారణంగా ఒక వ్యక్తి ఒక షాపును వేలంలో దక్కించుకునేందుకు అవకాశం ఉంది.

కానీ ఓ వ్యక్తి గతేడాది నిర్వహించిన వేలంలో బి నామీ పేర్లతో ఏకంగా తొమ్మిది షాపులు దక్కించుకున్నాడు. గత నెలతో గడువు ముగిసినా వేలం సొమ్ము చెల్లించనే లేదు. దుకా ణాలు ఖాళీ చేయలేదు. అవి ఖాళీ చేయందే కొత్తవారికి కేటాయించేందుకు వీలు లేదు. ప్రస్తుతం బినామీలు ఎక్కడున్నారో తెలియ దు. అక్రమార్కుడి సంగతైతే ఒక దేవుడికే ఎ రుక. ఇలా గతేడాది వేలానికి సంధించిన సొ మ్ము అందక.. కొత్త షాపుల నుంచి కొత్త ఆ దాయం రాదు. ఆలయ ఆదాయానికి మా త్రం భారీగా గండిపడుతోంది.

దక్కించుకున్న షాపులు ఇవి..

అక్రమార్కుడు ఆలయ సమీపంలోని 1వ నంబర్ షాపును రూ.2.20 లక్షలు, 3వ నం బర్ షాపును రూ.80 వేలు , 4వ నంబర్ షాపును రూ.44 వేలు, కొత్త కాంప్లెక్స్‌లోని 4వ నంబర్ షాపును రూ.1.38 లక్షలు, 6వ నంబర్ షాపును రూ.7,200 వేలు, 7వ నం బర్ షాపును రూ.8,600, 8వ నంబర్ షా పును రూ.26 వేలు, 10 నంబర్ షాపును రూ.7,200, 12వ నంబర్ షాపును రూ.30 వేలకు వేలంలో దక్కించుకున్నాడు. అలాగే కొబ్బరి చిప్పలు పోగుచేసుకొనేందుకు రూ. 11 లక్షలకు వేలం పాడుకున్నాడు. అంతా కలి పి దేవాదాయశాఖకు సుమారు రూ.20 లక్ష లు చెల్లించాల్సి ఉన్నది. సాధారణంగా వేలం జరుగుతున్న సమయంలో షాపులు దక్కించుకున్న వెంటనే పాడుకున్న సొ మ్ములో 25 శాతం చెల్లించాల్సి ఉంటుంది. 

తర్వాత విడతల వారీగా మిగిలిన 75శాతం సొమ్ము చెల్లి ంచాలి. కానీ ఈ అక్రమార్కుడు షాపులు న డుపుతున్న వారి నుంచి అద్దెలు వసూలు చే యలేదు. వారిద్వారా ఆలయానికి చెల్లించాల్సిన సొమ్మునూ అప్పగించలేదు. ఇదిలా ఉ ంటే భక్తుల సౌకర్యార్థం ఇటీవల ఓ దాత షె డ్డు నిర్మించగా, షెడ్డుపై వేలం సొమ్ము ఎగ్గొ ట్టిన అక్రమార్కుడు దాతగా త న పేరును రా యించుకోవడం గమనార్హం. సదరు అక్రమా ర్కుడు గత పాలక మండలికి కొంత తాయిల ం ఇచ్చి తనపేరు రాయించుకొన్నాడని స్థాని కంగా ప్రచారం జరుగుతోంది. వేలం సొ మ్ము చెల్లింపుతో పాటు దాత నిర్మించిన షె డ్డుపై వేరొకరి పేరు రాయించుకున్న విషయ మై ఈవో రజనీకుమారిని వివరణ కోరగా ఆమె సమాధానం చెప్పకుండా దాటవేశారు.