18 July, 2026 | 3:55 PM

చెట్టును ఢీకొన్న బైక్.. యువకుడు మృతి

18-07-2026 03:55 PM

నంగునూరు,(విజయక్రాంతి): నంగునూరు మండలం సిద్దన్నపేట వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. జీపీ తండా గ్రామానికి చెందిన భూక్యా గణేష్ నాయక్ (26), బైక్‌పై వెళ్తుండగా సిద్దన్నపేట స్టేజ్ వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో గణేష్ నాయక్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్ధిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.