సీఎం కప్ పోటీలో నిర్మల్కు 25 పథకాలు
27-02-2026 09:26 PM
నిర్మల్,(విజయక్రాంతి): రాష్ట్రస్థాయి సీఎం కప్ క్రీడా పోటీలో నిర్మల్ క్రీడాకారులకు పథకాల పంట పండింది. జిల్లా నుంచి వివిధ పోటీల్లో పాల్గొని విజేతలైన క్రీడాకారులు మొత్తం రాష్ట్రస్థాయిలో 25 పథకాలు సాధించారు. ఇందులో నాలుగు బంగారం ఎనిమిది వెండి 13 కాశ పథకాలను సాధించారు. వీరికి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సన్మానం చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఈవో భోజన్న జిల్లా క్రీడల అధికారి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.




