27 February, 2026 | 11:19 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారంలో మీడియా పాత్ర కీలకం

27-02-2026 09:29 PM

నిర్మల్,(విజయక్రాంతి): ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండే మీడియా వల్ల ప్రజా సమస్యల పరిష్కారమవుతాయని నిర్మల్ మున్సిపల్ చైర్ పర్సన్ అప్పల కావ్య గణేష్ చక్రవర్తిలు పేర్కొన్నారు. శుక్రవారం నిర్మల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కొత్తగా ఎన్నికైన చైర్ పర్సన్ వైస్ చైర్మన్ కు సన్మానం చేశారు. నిర్మల్ పట్టణంలో పాత్రికేయులు ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు తమ దృష్టికి తెచ్చేలా కథనాలు రాస్తే వాటిని పరిష్కరించే బాధ్యత తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ పాత్రికేయులు పాల్గొన్నారు.