22 August, 2026 | 5:48 PM

శేరికర్ రమేష్ చొరవతో విద్యార్థులకు బ్యాగుల పంపిణీ

22-08-2026 05:14 PM

నాగల్‌గిద్ద, ఆగస్టు 22 (విజయ క్రాంతి): మండలంలోని కరస్గుట్టి ఎంపీపీ‌ఎస్ పాఠశాలలో విద్యార్థులకు పాఠశాల బ్యాగుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులను ప్రోత్సహించడంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన పిల్లలకు చదువులో అండగా నిలవాలనే ఉద్దేశంతో V2 హెల్ప్ యూ ఫౌండేషన్ – ది గ్రూప్ ఫర్ నీడీ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. దివ్య మేడం సహకారం, విరాళంతో పాటు PRTU నాగల్‌గిద్ద మండల అధ్యక్షులు శేరికర్ రమేష్ చొరవతో విద్యార్థులకు బ్యాగులను అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాధికారి మన్మధ కిషోర్, స్థానిక కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్ హీరమన్, మండల స్ట్రాంగ్ టీచర్ రాఘవేందర్, PRTU రాష్ట్ర ఉపాధ్యక్షులు రవీందర్ రావు, PRTU నాగల్‌గిద్ద మండల ప్రధాన కార్యదర్శి జీవన్ తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థుల విద్యాభివృద్ధికి అవసరమైన సామగ్రిని అందించడం అభినందనీయమన్నారు. బ్యాగులు అందుకున్న విద్యార్థుల ముఖాల్లో ఆనందం, ఉత్సాహం కనిపించిందన్నారు. కొత్త బ్యాగులు పొందడంతో విద్యార్థుల్లో పాఠశాలపై, చదువుపై మరింత ఆసక్తి పెరుగుతుందని ఉపాధ్యాయులు తెలిపారు. విద్యార్థులకు అందించే ప్రతి సహాయం వారి భవిష్యత్తుకు బలమైన పునాది వంటిదని పేర్కొన్నారు. సమాజంలో అవసరమైన వారికి అండగా నిలుస్తూ, విద్యార్థుల విద్యాభివృద్ధికి V2 హెల్ప్ యూ ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని పాఠశాల సిబ్బంది అభినందించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్‌కు, ముఖ్యంగా దివ్య మేడంకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన కృష్ణ ప్రసాద్, నవీన్, రవీందర్, సావిత్రి, శేరికర్ రమేష్‌లకు ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులోనూ కొనసాగాలని ఆకాంక్షించారు.

.