భవనం కుప్పకూలి ఇద్దరు మృతి.. స్పందించిన రంగనాథ్
హైదరాబాద్: గచ్చిబౌలి(Gachibowli) అంజయ్య నగర్‌లో భవనం కుప్పకూలడంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. నాలాను ఆనుకుని 50 గజాల స్థలంలో ఏడు అంతస్తుల భవనం నిర్మించి, దానిపైన పెంట్ హౌస్ కూడా వేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. నిర్మాణంలో ఉన్న భవనం కూలి(Building Collapses) శిథిలాలు పక్కనున్న అపార్ట్ మెంట్ పై పడ్డాడంతో ఇద్దరు చనిపోయారు. అంజయ్య నగర్ లో ఇలాంటి భవనాలు చాలా ఉన్నాయని, ఇక్కడి భవనాల్లో చాలావాటికి సెట్ బ్యాక్ లు లేవని రంగనాథ్ వెల్లడించారు.
నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాలను కూల్చేస్తామని, ఇక్కడి భవనాలను హాస్టల్స్ కోసం వాడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. బిల్డర్ సాజిద్ కట్టే భవనాలన్ని ఇలాగే ఉన్నాయని స్థానికులు చెప్తున్నారని, కొద్ది రోజుల్లో ఈ భవనాలన్ని కూల్చేస్తామన్నారు. ఈ భవనాలన్ని ఖాళీ చేయించాలని యజమానులకు సూచిస్తున్నామని, నాలాను ఆక్రమించి ఇష్టానుసారంగా భవనాలు కట్టారని, అంజయ్య నగర్ లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని హైడ్రా కమిషనర్ తెలిపారు.






