22 August, 2026 | 5:33 PM

బొమ్మల కుంటలో పులి సంచారం గ్రామస్తుల్లో భయాందోళన

22-08-2026 05:02 PM

అమీన్‌ పూర్, ఆగస్టు 22(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలంలోని సుల్తాన్‌పూర్ మెడికల్ డివైస్ పార్క్ సమీపంలోని బొమ్మలకుంట శివారులో పులి సంచరిస్తున్నట్లు గుర్తించడంతో గ్రామస్తుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. పులి సంచరిస్తున్న దృశ్యాలు కనిపించడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. పులి మూతికి రక్తపు మరకలు ఉండటాన్ని గమనించిన గ్రామస్తులు అది ఏదో జంతువును వేటాడి తిన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో బొమ్మలకుంట, సుల్తాన్‌పూర్ పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వ్యవసాయ పొలాల్లోకి వెళ్లేందుకు కూడా స్థానికులు జంకుతున్నారు. పులి సంచారంపై అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి, దాని కదలికలను గుర్తించేందుకు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.