23 March, 2026 | 7:15 AM

గేట్‌లో నిర్మల్ విద్యార్థి ప్రతిభ

23-03-2026 12:00 AM

నిర్మల్, మార్చి 22 (విజయక్రాంతి): నిర్మల్‌లోని కొత్త పోచంపాడ్ గ్రామానికి చెందిన (శ్రీనగర్) చింతల సంగీతరవీందర్ దంపతుల కుమారుడు చింతల సంజయ్ ఇటీవల వెల్లడైన ఆల్ ఇండియా గేట్ సివిల్ ఇంజనీరింగ్ ఫలితాల్లో 432 స్కోర్ సాధించి ప్రతిభ కనబరిచాడు. ఈ విజయంతో కుటుంబ సభ్యులు, బంధువులు, కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం శ్రీనగర్లోని ఆయన నివాసంలో రవీందర్ మిత్రులు సంజయ్ను శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా సంజయ్ కృషి, పట్టుదల, నియమం విజయానికి కారణమని పలువురు అభినందించారు. గ్రామ యువతకు ఆయన ఆదర్శంగా నిలిచారని పేర్కొ న్నారు. సంజయ్ మాట్లాడుతూ తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల మార్గదర్శకత తోనే ఈ ఫలితం సాధ్యమైందని తెలిపారు. భవిష్యత్తులో మరింత ఉన్నత చదువులు అభ్యసించి దేశానికి ఉపయోగపడే ఇంజనీర్గా ఎదగాలని తన లక్ష్యమని చెప్పారు. ఈకార్యక్రమంలో గుమ్ముల అశోక్, తాటికొండ స్వామి, మిత్రులు, కాలనీవాసులు పాల్గొన్నారు.