తాగునీరు రైతుల రక్షణే ప్రాధాన్యం
ఉమ్మడి జిల్లా సమీక్షలో ఎమ్మెల్యేల కీలక సూచనలు
కరీంనగర్, జూలై19(విజయాలక్రాంతి): ఎల్నినో ప్రభావం నేపథ్యంలో నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై పలు కీలక సూచనలు కరీంనగర్ ఎమ్మెల్యే గంగు ల కమలాకర్ మాట్లాడుతూ తాగునీటి సమ స్య పరిష్కారానికి ప్రతి ఎమ్మెల్యేకు డీఎంఎఫ్ నిధుల నుంచి రూ. కోటి చొప్పున కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఆ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. ఎల్నినో ప్రభావంతో రైతులు సాగు నీటి, ప్రజలు తాగునీటి సమస్యలను ఎదుర్కొంటున్నారని, వైరల్ ఫీవర్లు పెరుగుతున్న నేపథ్యంలో కరీంనగర్లో వైద్య శాఖ అప్రమత్తంగా ఉండి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు.కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజ య్ మాట్లాడుతూ జిల్లాలోని జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోయాయని, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలని, వరద కాలువ, కాకతీయ కెనాల్లో నీటి ప్రవాహం పునరుద్ధరిం చాలని ప్రభుత్వాన్ని కోరారు.మానకొండూ రు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ వర్షపాతం తక్కువగా నమోదవుతున్నందున రైతులు వరికి బదులుగా నువ్వులు, ఇతర ఆరుతడి పంటల సాగు వైపు మళ్లాలని సూచించారు.
అధికారులు గ్రామస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని, మానేరు రివర్ ఫ్రంట్ పనులను వేగంగా పూర్తి చేయాలని కోరారు.చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లా డుతూ రైతులను ఆదుకోవడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రులు జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారని, రాజకీయాలకు తావు లేకుండా రైతులకు భరోసా కల్పించాలని అన్నారు.
ప్రత్యామ్నాయ పంటలు, పంటల మార్పిడి విధానాన్ని ప్రతి రైతుకు చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలని సూచించారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ప్రభుత్వం రైతులు, ప్రజలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.
కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ కరీంనగర్ నగరంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. ప్రస్తుతం ఎల్‌ఎండీ రిజర్వాయర్లో 5.2 టీఎంసీల నీరు మాత్రమే ఉందని, ఎల్లంపల్లి నుంచి రెండు టీఎంసీల నీటిని ఎల్‌ఎండీకి తరలించాలని ప్రభుత్వాన్ని కోరారు.రామగుండం మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ రామగుండంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక నిధులు కేటాయించి అవసరమైన చోట్ల బోర్లు వేయించాలని కోరారు.






