3 August, 2026 | 1:41 AM

బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న నిర్మలా జగ్గారెడ్డి

03-08-2026 12:26 AM

సంగారెడ్డి, ఆగస్టు 2: సంగారెడ్డి నియోజకవర్గంలో పలు చోట్ల జరిగిన ఆషాఢమాసం బోనాల ఉత్సవాల్లో డీసీసీ అధ్యక్షురాలు, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. సదాశివపేట మండలం ఆత్మకూరు గ్రామంలోని దుర్గమ్మ, పోచమ్మ బోనాల ఉత్సవాలకు హాజరైన ఆమె అమ్మవార్లకు స్వయంగా బోనాలు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బ్రహ్మ చారి, గ్రామ నాయకులు పాల్గొన్నారు. అనంతరం సదాశివపేట పట్టణంలోని దుర్గమ్మ గుడి వద్ద జరిగిన బోనాల ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఅర్‌ఎఫ్ కార్మిక సంఘం నాయకుడు శేఖర్ తో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు. సంగారెడ్డి పట్టణంలోని సంజీవనగర్ కాలనీలో పోచమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు.   గుడిని సందర్శించి  అమ్మవారికి  ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు మధు, కాలనీ నాయకులు పాల్గొన్నారు.