3 August, 2026 | 1:41 AM

కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం

03-08-2026 12:26 AM

ఎమ్మెల్యే బీ ఎల్ ఆర్

మిర్యాలగూడ, ఆగస్టు 2 :కాంగ్రెస్ పార్టీ తోనే సామాజిక న్యాయం సాధ్యం అవుతుందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి అన్నారు.  మిర్యాలగూడ మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికైన గుండు నరేందర్ గౌడ్  కి ఆదివారం గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని, పార్టీ కోసం పని చేసిన వారికి తగిన గుర్తింపు లభిస్తుందన్నారు.

నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అన్ని వర్గాల ప్రజలను సమన్వయం చేస్తూ పార్టీ సిద్ధాంతాలని  ప్రజలకు చేరువ చేయాలని కోరారు. అదేవిదంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందేలా చొరవ చూపాలని కోరారు. అనంతరం నరేందర్ గౌడ్ ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిలుకూరు బాలకృష్ణ, గుడిపాటి నవీన్ కుమార్, గౌడ సంఘం నాయకులు గుండు శ్రీరాములు గౌడ్, బోడ పాండు గౌడు, ఉదయ భాస్కర్ గౌడ్, కాకునూరి బసవయ్య గౌడ్,పోల గాని వెంకటేష్ గౌడ్, పెద్ది శ్రీనివాస్ గౌడ్,గౌడ సంఘం ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.