calender_icon.png 5 December, 2025 | 1:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోక్‌సభలో హిందీలో మాట్లాడిన నిర్మల

05-12-2025 01:12:57 AM

  1. ఎంపీ సౌగత్‌రాయ్ అభ్యంతరం 

నేను ఏ భాషలోనైనా మాట్లాడొచ్చన్న కేంద్రమంత్రి 

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: పార్లమెంట్ సమావేశాల్లో గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక బిల్లుపై హిందీలో మాట్లాడారు. ‘నిర్మలా జీ కూడా హిందీలో మాట్లాడారు. మేం బెంగాలీలం. ఆమె చెప్పినదాన్ని నేను అనుసరించలేకపోయాను.

మేం హిందీని అంతగా అనుసరించం’ అని ఎంపీ సౌగత రాయ్ అన్నారు. సభా కార్యకలాపాలు బహుళ భాషల్లో అందుబాటులో ఉన్నాయని చైర్ జగదాంబికా పాల్ వెంటనే తెలిపారు.  చర్చలో జోక్యం చేసుకుంటూ సీతారామన్.. రాయ్ వ్యాఖ్యను తీవ్రంగా వ్యతిరేకించారు. ‘నేను హిందీ, తమిళం, తెలుగు ఇంగ్లిషులో మాట్లాడొచ్చు.  ‘నేను హిందీలో మాట్లాడాను. కాబట్టి అతను అర్థం చేసుకోలేడు? బిల్లు నుంచి దృష్టి మరల్చడానికి రాయ్ ప్రయత్నిస్తున్నారని మంత్రి ఆరోపించారు.