05-12-2025 01:06:23 AM
న్యూ ఢిల్లీ డిసెంబర్ 4 : రష్యా--ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారి పుతిన్ భారత దేశ పర్యటనకు వచ్చారు. భారత్ 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం ఆయన రెండు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. గురువారం సాయంత్రం 7.10 గంటలకు ఆయన మా స్కో నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనతో పాటు ఎనిమిది మంది మంత్రు ల బృందం కూడా వచ్చింది. వారికి పాలం ఎయిర్‌పోర్టులో ప్రధాని మోదీ ప్రొటోకాల్ పక్కనపెట్టి ఘన స్వాగతం పలికారు.
ఆప్యాయంగా ఆత్మీయ ఆలింగనం చేసుకుని సాద రంగా ఆహ్వానించారు. ఆ తర్వాత కళాకారులు నృత్యం చేస్తూ రష్యా అతిథి బృం దాని కి సంప్రదాయంగా స్వాగతం పలికారు. అనంతరం భారీ భద్రతతో ఒకే కారులో మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధాని అధి కారిక నివాసానికి బయలుదేరారు. రాత్రి రష్యా అధ్యక్షుడితో పాటు ఆయన మంత్రుల బృందానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విందు ఇచ్చారు.
కాగా, పుతిన్‌కు మోదీ స్వాగతం పలుకుతారని ఉహించలేదని రష్యా అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు రాష్ట్రపతి భవన్‌లో అధికారిక స్వాగతం పలుకనున్నారు. అనంతరం పుతిన్ రాజ్‌ఘాట్‌ను సందర్శించనున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ హౌస్‌లో ఇరు దేశా ల ప్రధాన మంత్రుల శిఖరాగ్ర సమావేశం జరగనుంది. మొత్తంగా 26గంటల పాటు భారత్‌లో ఉండే పుతిన్ రక్షణ, ఇంధనం, మొబిలిటీ, ఆరోగ్య సంరక్షణ, లాజిస్టిక్స్, చెల్లింపులు, వ్యాపార సంబంధాలను బలోపేతం చేసే తదితర 25కు పైగా ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు.
పలు వాణిజ్య ఒప్పందాలు
2024- -25లో భారత్ రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం 68.7 బిలియన్ డాలర్లుగా ఉంది. భారత్ 4.9 బిలియన్ డాలర్ల ఉత్పత్తులను రష్యాకు ఎగుమతి చేయగా.. రష్యా నుంచి ఏకంగా 64 బిలియన్ డాలర్ల దిగుమతులను చేసుకుంది. ఇరుదేశాల మధ్య వాణిజ్య లోటు తీవ్రంగా ఉండటానికి మన ఇంధన కొనుగోళ్లే కారణం. ఈ లోటును భర్తీ చేసుకునేలా చర్యలు తీసుకుంటామని ఇప్పటికే రష్యా హామీ ఇచ్చింది. ఆ మేరకు భారతీయ ఉత్పత్తుల దిగుమతులను పెంచుకునేలా రష్యా ఒప్పందాలు కుదుర్చుకుంటే భారత్‌కు భారీగా ప్రయోజనం చేకూరనుంది.
రక్షణ ఉత్పత్తుల తయారీలో ...
భారత సాయుధ దళాలు వినియోగించే ఆయుధాల్లో 36 శాతం రష్యావే. రక్షణ సహకారం, లాజిస్టిక్స్ ఒప్పందాల్లో భాగంగా మరిన్ని ఎస్400 గగనతల రక్షణ వ్యవస్థలతో పాటు ఐదోతరం సుఖోయ్-57 యుద్ధ విమానాల కొనుగోలుపై చర్చలు, ఒప్పందాలు ఎజెండాలో ఉన్నాయి. ఆపరేషన్ సిం దూర్‌లో పాక్ దాడుల నుంచి భారత్‌కు రక్షణ కవచంలా నిలిచిన ఎస్400కు అప్డేటెడ్ వర్షనైన ఎస్500 గగనతల రక్షణ వ్యవ స్థ అమ్మకాలపై ఇరుదేశాలు ఓ అవగాహనకు రానున్నట్లు తెలుస్తోంది.
స్వావలంబనకు రష్యా చేయూత
రక్షణ ఉత్పత్తుల తయారీలో స్వావలంబన సాధించాలని భారత్ లక్ష్యంగా పెట్టు కుంది. అందుకు అనుగుణంగా క్షిపణులు, యుద్ధనౌకలు, జలాంతర్గాములు, విమానాలు, ఇతర రక్షణ సాంకేతిక అంశాల్లో సహా -అభివృద్ధి, ఉమ్మడి తయారీని పెంచేలా చర్చలు, ఒప్పందాలు జరగనున్నాయి.
ముడి చమురు దిగుమతిపై..
పుతిన్ పర్యటనలో ఇంధనం ప్రముఖం గా ప్రస్తావనకు రానుంది. భారత్‌కు తక్కువ ధరకే రష్యా ముడి చమురును సరఫరా చేస్తోంది. ఇది రెండు దేశాలకూ ప్రయోజనకరంగా ఉన్న వేళ ఇంధన కొనుగోళ్లపై మరి న్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పౌర అణు సహకారంలో భాగంగా అణుశక్తిపై ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది.
బిజినెస్ ఫోరంలో..
ఇక ఆర్థిక, వ్యాపార పరమైన అంశాలపై చర్చించేందుకు ఢిల్లీలో బిజినెస్ ఫోరం జరగనుంది. రష్యాకు భారత యంత్రాలు, వ్యవ సాయం, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ఎగుమతుల పెంపుపై చర్చించనున్నారు. ఏటా 34 మిలియన్ టన్నుల దిగుమతులతో రష్యా ఎరువు లపై ఆధారపడుతున్న భారత్..వాటిని మరిం త పెంచాలని భావిస్తోంది.
ఢిల్లీలో హై అలర్ట్
నాలుగేళ్ల విరామం అనంతరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనకు వస్తున్న నేపథ్యం లో రాజధాని ఢిల్లీని పోలీసులు హై అలర్ట్ చేశారు. గురువారం సాయం త్రం పుతిన్ ఢిల్లీలో అడుగు పెట్టిన నేపథ్యంలో నగరంలో ఎన్నడూలేని విధంగా పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. అడుగడుగునా ఆంక్షలు విధించారు. పుతిన్ ఎక్కడ బస చేస్తారనే వివరాలను భద్రతా కారణాల రీత్యా గోప్యంగా ఉంచినట్లు పోలీసులు వెల్లడించారు. మొత్తంగా ఐదు వేలకు పైగా భద్రతా సిబ్బందిని నియమించారు.

కేంద్రం సంప్రదాయాన్ని విస్మరిస్తోంది
విదేశీ ప్రతినిధులు భారత్‌కు వచ్చినప్పుడు ప్రతిపక్ష నేతతో సమావేశం కాకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణ చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దేశ పర్యటనకు ముందు ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రాహుల్‌గాంధీ పార్లమెంట్ వెలుపల గురువారం మీడియాతో మాట్లాడారు.
గతంలో విదేశీ ప్రతినిధులు దేశానికి వస్తే ప్రతిపక్ష నాయకుడితో సమావేశమవడం ఒక సంప్రదాయంగా ఉండేదని గుర్తుచేశారు. వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల హయాంలోనూ ఈ పద్ధతి కొనసాగిందని గుర్తు చేశారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ సంప్రదాయాన్ని పక్కనపెట్టిందని ఆరోపించారు. ‘విదేశీ ప్రతినిధులతో మమ్మల్ని కలవకుండా ప్రభుత్వం అడ్డుకుంటోంది. ప్రతిపక్ష నేతతో మాట్లాడొద్దని వారికి సూచిస్తోంది. ప్రభుత్వం తన అభద్రతాభావం కారణంగానే ఇలా చేస్తోంది‘ అని రాహుల్ పేర్కొన్నారు.