05-12-2025 01:14:07 AM
న్యూఢిల్లీ, డిసెంబర్ 4: టోల్‌ప్లాజాల వద్ద ఇకపై ఒక్క క్షణం కూడా ఆగాల్సిన అవసరం ఉండదని, దీనికి సంబంధించి కొత్త ఎలక్ట్రానిక్ సిస్టమ్ త్వరలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. జాతీయ రహదారులపై ఎన్‌ఈటీసీ విధానం రానుందని, దీన్ని దేశవ్యాప్తంగా త్వరలో అమలు చేయడానికి ఎన్‌పీసీఐ సిద్ధం అవుతుందని తెలిపారు. ప్రస్తుతం 10 ప్రాంతాల్లో అమలులో ఉన్న ఈ విధానం ఏడాదిలోనే దేశమంతా అమలులోకి వస్తుందని చెప్పారు.
ఈ మేరకు లోక్‌సభలో ప్రశ్నోత్తరాల వేళలో నితిన్‌గడ్కరీ మాట్లాడారు. ప్రస్తుతం టోల్ వసూలులో కొత్త విధానం అందుబాటులోకి వస్తుందని, ఇకపై టోల్‌ప్లాజాల వద్ద ఎవ్వరూ మిమ్మల్ని ఆపరని చెప్పారు. ప్రస్తుతం దేశమంతా రూ.10లక్షల కోట్ల విలువైన 4,500 హైవే ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని తెలిపారు.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) ఇటీవల విడుదల చేసిన ఓ ప్రటన ప్రకారం..టోల్ ప్లాజాల వద్ద ఫీజు వసూలుకు నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్(ఎన్‌ఈటీసీ) కార్యక్రమాన్ని ఎన్‌పీసీఐ తెచ్చింది. ఇది కూడా ఫాస్టగ్ ద్వారానే పనిచేస్తుంది. టోల్‌ప్లాజా మీ దుగా వెళ్లినప్పుడు వాహనం ఆపాల్సిన అవసరం లేకుండానే యూజర్ బ్యాంక్ అకౌంట్ నుంచి ఫీజు ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది.