25 July, 2026 | 2:15 PM

యాదాద్రిలో నిత్యకల్యాణం

31-05-2024 01:47 AM

యాదాద్రి భువనగిరి, మే 30 (విజయక్రాంతి): ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామివారి సన్నిధిలో గురువారం నిత్యపూజలు ఘనంగా నిర్వహిం చారు. గజవాహనం లక్ష్మీనర్సింహ ఉత్సవమూర్తులను  మంగళవాయిద్యాలతో తిరువీ ధుల్లో ఊరేగుతూ ఉత్సవ మండపంపై అధిష్టింప చేసి వేద మంత్రాలు, మంగళ వాయి ద్యాలతో ఆగమశాస్త్ర ప్రకారం నిత్యకల్యాణం నిర్వహించారు. అంతకుముందు హోమం జరిపారు. వేకువజామున గర్భాలయంలో స్వామివారికి సుప్రభాత సేవ, అర్చనలు, అభిషేకాలు జరిగాయి. సాయంత్రం వేడిజోడి సేవ జరిపారు. స్వామివారికి భక్తులు జరిపించుకున్న వివిధ కైంకర్యాల ద్వారా గురువారం ఒక్కరోజే రూ. 48,35,096 ఆదాయం సమకూరినట్టు ఆలయ అధికారులు ప్రకటించారు.